ఇవ్వాల రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురుగ్రహం భూమికి అత్యంత చేరువగా రానుంది. శని, బృహస్పతి, భూగ్రహాలు మూడూ ఒకే రేఖలో కనిపించనున్నాయి. గురుగ్రహం భూమికి అత్యంత దగ్గరగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 1963లో ఇది సాధ్యమైంది. మళ్లీ ఈ దృశ్యాన్ని చూడాలంటే ఎన్నో తరాలు ఆగాల్సిందే.
107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురుడు భూమికి చేరువగా రానున్నట్టు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే భాగ్యం ఉండదు. భూమికి సమీపానికి వచ్చినప్పుడు రెండు గ్రహాల మధ్య దూరం 59,06,29,248 (59.06 కోట్ల) కి. మీ ఉంటుంది. దూరంగా వెళ్లినప్పుడు భూ – గురు గ్రహాల మధ్య 96,56,06,400 (96.56కోట్ల) కి. మీ వ్యత్యాసం ఉంటుంది. సౌరవ్యవస్థలో అతిపెద్దదైన గురుగ్రహం భూమికి సమీపానికి వచ్చినప్పుడు ఇంకా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించే అవకాశం ఉంది.