Saturday, November 23, 2024

Gurugram | భార్య చేతిలో రైల్వే పోలీసు హత్య.. గురుగ్రామ్‌లో ఘటన

భార్య చేతిలో ఒక అసిస్టెంట్‌ రైల్వే పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చనిపోయిన ఘటన గురుగ్రామ్‌లోని షికోహ్‌పుర్ర గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ రాజ్‌బీర్‌(49) తన భార్య ఆరతి, కుమారుడు అను అలియాస్‌ యష్‌తో కలిసి సెక్టార్‌ 10ఏ లోని వారి ఇంట్లో నివసిస్తున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు మద్యం మత్తులో ఉన్న రాజ్‌బీర్‌, ఆరతితో వాదులాటకు దిగాడు.

గొడవ పెద్దది కావడంతో ఆగ్రహంతో తన దగ్గర అక్రమంగా ఉన్న తుపాకీతో ఆమెను కాల్చాడు. ఆ తర్వాత తుపాకీని మంచం మీదకు విసిరివేశాడు. గాయంతో ఉన్న ఆరతి అదే తుపాకీతో రాజ్‌బీర్‌పై మూడు సార్లు కాల్పులు జరిపింది. తల్లిదండ్రులద్దరిని యష్‌ ఆసుపత్రిలోకి తరలించగా రాజ్‌బీర్‌ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. రాజ్‌బీర్‌ సోదరుడు సత్‌బీర్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరతి, యజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement