మెదక్: నెమలి నృత్యం గురించి వినని వారు చాలా తక్కువ. నెమలి నాట్యం చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో నెమలి పురి విప్పి నృత్యం చేస్తుందని అందరికి తెలుసు. అయితే ఈ దృశ్యం చాలా అరుదు. అలాంటిది దుబ్బాక మండలం పరశురాం నగర్ లో అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ నెమలి ప్రకృతి రమణీయతకు పరవశించి పురి విప్పి నాట్యమాడింది. నెమలి తన అందమైన ఈకలను పురువిప్పి నృత్యం చేసిన ఈ అందమైన దృశ్యాన్ని స్థానికులు కొందరు తమ సెల్ఫోన్లలో బంధించారు. ఈ వీడియో చూసి ఈ సీన్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్స్.
Advertisement
తాజా వార్తలు
Advertisement