Tuesday, November 19, 2024

ఉబెర్ లో కొత్త ‘‘టెక్-ఎనేబుల్డ్ సేఫ్టీ ఫీచర్’’.. హైదరాబాద్‌లో లాంచ్ చేసిన కంపెనీ

దేశంలోని ప్రముఖ క్యాబ్ కంపెనీ ఉబెర్ తమ క్యాబ్ బుక్ చేసుకున్న రైడర్స్ కోసం ఓ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. దీనికి సంబంధించి ఇవ్వాల (మంగళవారం) హైదరాబాద్‌లో ఈ టెక్ ఫీచర్ ను లాంచ్ చేసింది కంపెనీ. తమ రైడర్‌లు క్యాబ్ లో సీటు బెల్ట్‌లను ధరించేలా కొత్త టెక్-ఎనేబుల్డ్ సేఫ్టీ ఫీచర్ ‘ఆడియో సీట్‌బెల్ట్ రిమైండర్’ని విడుదల చేసింది. రాబోయే నెలల్లో ఈ ఫీచర్‌ని ఇతర నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది కంపెనీ తెలిపింది..

“ఆడియో సీట్‌బెల్ట్ రిమైండర్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. ఈ కొత్త ఫీచర్ రైడర్స్ సీట్ బెల్ట్ ధరించేలా ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన మార్గం అని మేము విశ్వసిస్తున్నాము. హైదరాబాద్‌లో రహదారి భద్రతపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపుతుందని మేము సంతోషిస్తున్నాము” అని ఉబెర్ ఇండియా సేఫ్టీ ఆపరేషన్స్ హెడ్ సూరజ్ నాయర్ తెలిపారు.

రైడర్ ట్రిప్‌ను బుక్ చేసి క్యాబ్ లో ప్రవేశించిన తర్వాత, డ్రైవర్ ఫోన్ “దయచేసి మీ భద్రత కోసం వెనుక సీట్ బెల్ట్‌లను ఉపయోగించండి” అని రైడర్‌లను కోరుతూ ఆడియో రిమైండర్‌ను ప్లే చేస్తుంది. అదే సమయంలో, రైడర్ ఫోన్ కి కూడా ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు సీట్ బెల్ట్ బకిల్-ఇన్ చేయమని యాప్‌లో పుష్ నోటిఫికేషన్‌ను వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ‘ఆడియో సీట్‌బెల్ట్ రిమైండర్’ ద్వారా రైడర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement