దేశంలో పశువులకు సోకే లంపీ డిసీజ్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ భారిన పడి రాజస్థాన్‌లో 12 వేల పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం పశువుల సంతలపై నిషేధం విధించింది. రాజస్థాన్‌లో ఇప్పటి వరకు 2,81,484 పశువులకు లంపీ వ్యాధి సోకిందని గుర్తించారు. వీటిలో 2,41,685 పశువులకు చికిత్స అందించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో లంపీ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ, పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పీసీ కిషన్ తెలిపారు. రాజస్థాన్ తర్వాత గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఉత్తరాఖండ్‌లలో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదు. అయితే, ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు
వ్యాధి లక్షణాలు ఇలా…
లంపీ వైరస్ సోకిన పశువులు జర్వం బారినపడతాయి.
వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి.
ఆ తర్వాత బరువును కోల్పోతాయి.
పాల దిగుబడి పడిపోతుంది.
అనంతరం శ్వాస, లాలాజల స్రావాలు ఎక్కువై మరణిస్తాయి.