Friday, November 22, 2024

బస్తీ దవాఖానాలతో ఎంతో మేలు.. ప్రజలకు మరింత చేరువలో వైద్యం: మంత్రి తలసాని

సనత్ నగర్ (ప్ర‌భ న్యూస్‌ : అభివృద్ధి,సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంద‌ని.. వాటిని ప్ర‌జ‌లు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ డివిజన్ దాసారం బస్తీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో కూడా ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఆలోచనతో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామ‌న్నారు.

ఈ బస్తీ దవాఖాన లో వైద్యం, మందులు ఉచితంగా అందిస్తార‌ని, 64 రకాల వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తార‌ని వివరించారు. ఇదే కాకుండా అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా 250 కోట్ల రూపాయల వ్యయంతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టి, పరీక్షలు చేసి, కళ్ళద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్ కు వెళితే వేలాది రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని లబ్ది పొందాలని సూచించారు.

- Advertisement -

స్థానిక బస్తీ ప్రజల సౌకర్యార్థం మంజూరైన బస్తీ దవాఖానను బస్తీ వాసుల ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత నే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్తీ దవాఖాన ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాలు, ఏ విధమైన వైద్య సేవలు అందుతాయో తెలియజేసేలా వీడియోను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రదర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement