Friday, November 22, 2024

కేజీ ఉల్లి రూ.1200.. ఫిలిప్పీన్స్‌లో తీవ్ర కొరత

ఫిలిప్పీన్స్‌లో ఉల్లి ధరలు కొండెక్కాయి. మాంసాహారం కంటే ఉల్లి ధరలే ఎక్కువగా ఉంటడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రాజధాని నగరం మనీలాలోని సూపర్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.1200 పలుకుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం 14ఏళ్ల గరిష్టానికి చేరింది. ఈ నేపథ్యంలో నిత్యావసరాలు ఒక్కొక్కటిగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ”ఉల్లిపాయలు కొనే పరిస్థితి లేకుండా అయింది. ఇంతింత ధరలు పెట్టి కొనడం కంటే కొన్నాళ్లు ఉల్లి వాడకాన్ని మానుకోవడమే మంచిదనే అభిప్రాయానికొచ్చాం” అని స్థానిక గృహిణి క్యాండీ రోసా తెలిపారు.

మరోవైపు డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. పంట పూర్తిస్థాయిలో ఎదకగముందే వాటిని విక్రయానికి తీసుకొస్తున్నారు. మరొకవైపు ఈ సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విదేశాల నుంచి తక్షణమే 21 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఆదేశాలిచ్చింది. అధికారిక గణాంకాల ప్రకారం ఇక్కడ ఒక్కొక పౌరుడు ఏడాదికి సగటున 2.34 కిలోల ఉల్లిని తింటున్నట్లు తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement