హైదరాబాద్, ఆంధ్రప్రభ: కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్స్ పరంగా నూతన మైలురాయిని అందుకుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లో అత్యధికంగా ఓ విద్యార్థికి రూ.55 లక్షల ప్యాకేజీని ఓ మల్టి నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ అందించినట్లు వర్సిటీ అధికారులు సోమవారం తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగాయని వెల్లడించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ఉద్యోగాల ఆఫర్ల సంఖ్య 42 శాతం పెరిగినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.