చైనాలో భారీ టోర్నడో హడలెత్తించింది. టోర్నడో తాకిడికి ఐదుగురు చనిపోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు చైనా షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని డోంగ్మింగ్ కౌంటీని టోర్నడో భీకరంగా తాకడంతో ప్రజలు అల్లాడిపోయారు. పలు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. చెట్లు నేలకూలాయి. దీంతో భారీ నష్టం సంభవించినట్లు అధికారులు లెక్కలేశారు.
స్థానిక ప్రభుత్వం కమాండ్ సెంటర్‌ను నెలకొల్పి అత్యవసర కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. షాన్‌డాండ్ ప్రావిన్స్‌లోని కైయువాన్‌లోఇ దాదాపు 2800 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్పారు. కాగా, చైనాను సగటున ఏటా 100 టోర్నడోలు తాకుతున్నాయి. గత ఏప్రిల్ నెలో సంభవించిన సుడిగాలి గ్యాంగ్‌జౌను తాకడంతో ఐదుగురు చనిపోయారు. మరో 33 మంది గాయపడ్డారు.