భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే సెమీస్ కు చేరుకుంది. అయితే, సెమీస్‌కి చేరాం అరి ఆనందపడేలోపలే ..ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. కోల్‌కతా వేదికగా నిన్న (ఆదివారం) జరిగిన మ్యాచ్ లో.. సఫారీ స్టార్ పేసర్ లుంగి ఎంగిడి గాయపడ్డాడు. దీంతో ఈ మెగాటోర్నీలోని మిగిలిన మ్యాచులకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రవీంద్ర జడేజా కొట్టిన బంతిని ఆపే క్రమంలో ఎంగిడి కాలికి గాయమైంది. దీంతో నొప్పితో అతడు విలవిలలాడాడు. నొప్పి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ ఓవర్‌ను పూర్తి చేయకుండానే అతడు డగౌట్‌కు వెళ్లిపోయాడు. మిగిలిన బంతులను మార్కో జాన్సెన్ వేశాడు. అనంతరం ఎంగిడి బ్యాటింగ్‌కు వచ్చాడు. మూడు బంతులు మాత్రమే ఆడి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మ్యాచ్ అనంతరం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఈ మెగాటోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇక అతడి బ్యాకప్‌గా రిలీ రూసోను భారత్‌కు పంపింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. పేసర్ అయిన ఎంగిడి స్థానంలో బ్యాటర్ రూసో పంపడం వెనుక ఓ కారణం ఉంది.