కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు నిదర్శనం గత కొంతకాలంగా ఏదో ఒక చోట కొండచిలువలు దర్శనమిస్తూనే ఉన్నాయి. మొన్న స్కూల్ బస్సులో తలదాచుకున్న కొండచిలవను చూశాం.. వారం రోజుల కిందట కోతిని మింగిన కొండచిలువను చూశాం.. ఇవన్నీ వివిధ జిల్లాలో జరిగిన ఘటనలు.. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో రైతు పొలంలో కొండ చిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ కనపడటంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం చాకచక్యంగా వ్యవహరించి కొండ చిలువను పట్టుకుని బస్తాలో వేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైతులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement