టెక్నో నుంచి పోవా 3 లాంచ్ అయ్యింది.. భారీ బ్యాటరీ కెపాసిటీతో బడ్జెట్ రేంజ్‌లో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. పెద్ద డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్, స్టీరియో స్పీకర్లతో టెక్నో పోవా3 లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది. ఈ మధ్యనే ఫిలిప్పీన్స్‌లో విడుదలైైన ఈ మొబైల్ ఇవ్వాల భారత్‌లో అడుగుపెట్టింది. 6.9 ఇంచుల ఫుల్ డాట్-ఇన్ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ని టెక్నో పోవా 3 కలిగి ఉంది.
మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతోంది. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్ వేరియంట్ అందుబాటులోకి రానుంది. అయితే.. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకుని వర్చువల్‌గా ఫోన్ ర్యామ్‌ను అదనంగా 5జీబీ వరకు పొడిగించుకునేలా మెమరీ ఫ్యుజన్ టెక్నాలజీని పోవా పొందుపరిచింది.
ఫొటోలు, వీడియోల కోసం పోన్ వెనుక 3 కెమెరాల సెటప్‌లో Tecno Pova 3 కనిపిస్తొంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో 2 కెెమెరాలున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను టెక్నో ఇస్తోంది. డీటీఎస్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తే డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ మొబైల్ కలిగి ఉంది. గేమింగ్ కోసం జీ-యాక్సిస్ లైనర్ మోటార్ ఈ ఫోన్‌లో ఉంటుంది.
Tecno Pova 3 ధర, అమ్మకం..
4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉన్న టెక్నో పోవా 3 బేస్ వేరియంట్ ధర రూ.11,499గా ఉంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా లాంచ్ అయ్యింది. అయితే దీని ధరను టెక్నో ఇంకా వెల్లడించలేదు. అమెజాన్‌లో టెక్నో పోవా 3 లిస్ట్ అయింది. ఈనెల 27వ తేదీన సేల్‌కు రానుంది. ఎకో బ్లాక్, టెక్ సిల్వర్ కలర్లలో ఈ మొబైల్ అభించనుంది. టెక్నో పోవా 3 మొబైల్‌లో 7000mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 14 గంటల పాటు గేమ్స్ ఆడవచ్చని టెక్నో పేర్కొంది. అలాగే 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 40 నిమిషాల్లో ఈ మొబైల్ 50 శాతం చార్జ్ అవుతుందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.