పాకిస్థాన్ – బంగ్లాదేశ్ మద్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు సత్తా చాటారు.
316/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ముష్పికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. లిటన్ దాస్ (56), మెహ్‌దీ హసన్ మీరాజ్ (77) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, ఖుర్రమ్ షెహ్‌జాద్, మహమ్మద్ అలీ రెండేసి వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టాడు. సయీమ్ ఆయుబ్ ఓ వికెట్ తీసాడు.
ఇక బంగ్లాదేశ్ ఆలౌట్ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో కెప్టెన్ షాన్ మసూద్(9 బ్యాటింగ్), ఆబ్దుల్లా షఫీక్(12 బ్యాటింగ్) ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 ఆలౌట్
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 23/1