జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. ఇజు చైన్‌లోని వెలుపలి ద్వీపాల్లో రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో.. జపాన్ వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే సునామీ హెచ్చరికను జారీ చేసింది. జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షుకి దక్షిణంగా విస్తరించి ఉన్న ద్వీపాలకు ఒక మీటరు ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తూర్పున టోక్యో చుట్టూ ఉన్న చిబా ప్రిఫెక్చర్ నుంచి పశ్చిమాన కగోషిమా ప్రిఫెక్చర్ వరకు విస్తరించి ఉన్న పెద్ద ప్రాంతానికి హెచ్చరిక వర్తింపజేయడంతో హోన్షులో 0.2 మీటర్ల వరకు చిన్నపాటి సునామీ ఉప్పెనలు వచ్చే అవకాశముంది. హచిజో ద్వీపంలోని యానే ప్రాంతంలో దాదాపు 30 సెంటీమీటర్ల చిన్న సునామీ ఏర్పడిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.