Friday, November 22, 2024

Breaking : జ‌పాన్ లో భారీ భూకంపం… తీవ్ర‌త 7.6గా న‌మోదు

నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజే జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇవాళ‌ జపాన్​లోని నార్త్​ సెంట్రల్​ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్థి నష్టం జరిగింద‌నే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కాగా.. తాజా భూకంపం కారణంగా.. ఆ ప్రాంతంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

సునామీ అలర్ట్​ జారీ..
జపాన్​ పశ్చిమ తీరంలోని ఇషికావా, నైగట, టయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. అదే ఇషికావాలోని వజిమా నగరంలో 1 మీటర్​ ఎత్తున్న అలలు తీరాన్ని తాకినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement