అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అలస్కా రీజియన్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపం వల్ల దక్షిణ అలస్కాను, అలస్కా ద్వీపకల్పాన్ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరించారు.
ఈరోజు సంభవించిన భూకంపం 9.3కి.మీ. (5.78మైళ్లు) లోతులో వచ్చినట్లు యూఎస్ జీఎస్ అధికారులు తెలిపారు పసిఫిక్ మహాసముద్ర తీరంలోగల ఉత్తర అమెరికాలోని ఇతర తీర ప్రాంతాలు, కెనడా తీర ప్రాంతాలపై సునామీ తీవ్రత ఏ మేరకు ఉండనుందో అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -