Saturday, October 5, 2024

Chhattisgarh: న‌క్స‌ల్స్ ఉద్య‌మానికి భారీ దెబ్బ‌..

ఎన్ కౌంట‌ర్ లో అయిదు రాష్ట్రాల క‌మాండ‌ర్లు హ‌తం
మోస్ట్ వాటెండ్ మావోయిస్ట్ లు మ‌ర‌ణం
మ‌ర‌ణించిన వారిలో తెలుగు రాష్ట్రాల వారే అధికం
నేడు కూడా కొన‌సాగుతున్న కూంబింగ్
ఇప్ప‌టికే 31 మృతదేహాలు స్వాధీనం
మిగిలిన మృత దేహాల కోసం పోలీసుల జ‌ల్లెడ‌

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్‌ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్ కౌంట‌ర్లో 36 మంది వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ట్లు చెబుతున్నారు.

కాగా, పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేశ్‌ ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు. నీతి అలియాస్ ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు. కాగా, కమలేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి.

- Advertisement -

సిట్టింగ్‌ జడ్జితో విచారించండి – పౌర హ‌క్కుల నేత‌లు…

ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలని ఏపీ పౌర హక్కుల సంఘం కోరింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారించాలని డిమాండ్‌ చేసింది.. మృతుల్లో ముఖ్యనేతలు నంబాల కేశవరావు, తక్కెళ్లపాడు వాసుదేవరావు ఉన్నట్లు సమాచారం ఉందని వారు ఒక ప్ర‌క‌ట‌న చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement