Sunday, November 24, 2024

భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. భూమిని తాకుతుందా?

ఓ భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోంది. ఇది విమానం సైజులో ఉంది. అది భూమిని చేరుకునే అవకాశం ఉంది అని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరిక జారీచేసింది. ఎన్‌ఈఒ 2022 క్యుపి3 అనే గ్రహశకలం ఆగస్టు 29న మధ్యాహ్నం 3.25 గంటలకు భూమికి సమీపం నుంచి వెళ్తుందని పేర్కొంది. ఈ గ్రహశకలం వెడల్పు 100 అడుగులు. ఇది భూమికి 5.51 మిలియన్‌ కి.మీ. చేరువగా వస్తుందని నాసా తెలిపింది. సెకనుగు 7.93 కి.మీ వేగంతో ప్రయాణిస్తు న్నట్లు గుర్తించింది.

నాసా ప్లానెటరీ డిఫెన్స్‌ కోఆర్డినేషన్‌ కార్యాలయ ప్రకటన ప్రకారం, గ్రహశకలం దాని దగ్గరి సామీప్యత కారణంగా ప్రమాదకరమైన వస్తువు గా పరిగణించింది. ఈ గ్రహశకలాలు 4.6 బిలియన్‌ సంవత్సరాల క్రితం సౌరవ్యవ స్థ ఏర్పడినప్పుడు అంతరిక్షంలో ఉండిపోయిన రాతి శకలాలు. ఈ రాతి శకలాల నుండి భూమిని రక్షించడానికి నాసా తన డార్ట్‌ (డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌) అంతరిక్ష నౌకను మోహరించింది. ఈ వ్యోమనౌక గ్రహశకలం మార్గాన్ని దారి మళ్లిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement