పాకిస్తాన్లో ఓ హిందు మహిళను అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సింజోరోలో హిందు మహిళ తల నరికి, చర్మ ఒలిచి హత్య చేసినట్లు పాకిస్తాన్ తొలి హిందూ మహిళా సెనేటర్ కృష్ణకుమారి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు.
40 ఏళ్ల మహిళ తలను వేరుచేసి, శరీర అవయవాలను వేరుచేసి అత్యంత దారుణంగా హత్య చేశారని, మృతదేహం అత్యంత దారుణమైన స్థితిలో కనిపించిందని కృష్ణకుమార్ పేర్కొన్నారు. మృతురాలికి నలుగురు సంతానం ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సెనేటర్ కృష్ణకుమారి వివరించారు.