Saturday, November 23, 2024

రూబీ హోటల్ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జ‌ర‌పాలి : కేంద్రం మంత్రి కిష‌న్ రెడ్డి

అగ్నిప్రమాదం జరిగిన రూబీ హోటల్ వద్దకు చేరుకుని ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలన్నారు. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది తెలియాలన్నారు. వెహికిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లోపం ఉంటే ఎలక్ట్రికల్ వెహికిల్ కంపెనీపై కేసు పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు వసూలు చేయడానికే రాకూడదని.. ఇలాంటి కాంప్లెక్స్ , అపార్టుమెంట్ల లో తనిఖీలు చేయాలని సూచించారు. అన్ని వ్యాపార సంస్థల వారు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల వారు విధిగా ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టం ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ చనిపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయాలైన వారికి 50 వేలు ప్రకటించారు. మృతుల రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారిని ఆదుకోవాలని కోరుతానని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement