Tuesday, July 2, 2024

Forest Rules | జింకల గుంపు రిలాక్స్, ఎదురుగానే పులి.. ఇంకేమన్నా ఉందా?

జింకల మంద రిలాక్స్​ అవుతోంది.. అయితే.. అవి అక్కడే పొంచి ఉన్న పులిని గమనించి కాస్త ఆందోళనకు గురయ్యాయి. తొలుత పరుగు అందుకునేందుకు రెడీ అయిపోయాయి.. కానీ, తమకు ముప్పులేదని గమనించాయి. ఇక.. అడవి రాజు అయిన పులి కూడా కొన్ని రూల్స్​ని ఫాలో అవుతుంది. తాను వినోదం కోసం పోరాటం చేయదు. ప్రకృతిలోని కొన్ని నియమాలను జంతువులు కూడా పాటిస్తుంటాయనడానికి ఇదో పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. కానీ, మనుషులు మాత్రం అలా కాకుండా తమ ఇష్టానుసారం వ్యవహరిస్తుంటారు. అందుకే ప్రకృతి ప్రకోపానికి గురవుతుంటారు. అంటూ స్మాల్​ స్టోరీని ట్విట్టర్​లో షేర్​ చేశారు మాజీ ఎంపీ, బీఆర్​ఎస్ నేత జోగినపల్లి సంతోష్​కుమార్​.

సండే ఫొటో స్టోరీ పేరుతో తాను కొన్ని ఫొటోలను, వీడియోని షేర్​ చేశారు. ఇలాంటి సన్నివేశమే తనకు ఈ మధ్య ఎదురైందని గ్రీన్​ ఇండియా చాలెంజ్​ వ్యవస్థాపకుడు అయిన సంతోష్​ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అతిపెద్ద జాతీయ టైగర్​ రిజర్వ్అయిన తడోబా అంధేరీలో ఈ మధ్య తాను పర్యటించినట్టు జె. సంతోష్​కుమార్​ తెలిపారు. ఇది భారతదేశంలో ఉన్న 47 టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులలో ఒకటి. మహారాష్ట్ర, చంద్రపూర్ జిల్లాలో ఇది ఉంది. ఇందులో తడోబా నేషనల్ పార్క్ 1955లో నెలకొల్పారు. అంధారి వన్యప్రాణుల అభయారణ్యం 1986లో ఏర్పడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement