స్పాట్‌లోనే నలుగురు మృతి
అమెరికాలోని హూస్టన్‌లో ఘటన
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హూస్టన్ సిటీలో.. రేడియో టవర్‌ను ఓ హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్న నలుగురు చనిపోయారు. సమీపంలో ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న పరిస్థితిని స్థానికులు తమ వీడియోల్లో రికార్డు చేశారు. కాగా, ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ప్రైవేటు కంపెనీకి చెందిన ఆర్44 హెలికాప్టర్.. రేడియో స్టేషన్‌ను ఢీకొట్టింది. రేడియో టవర్ సమీపంలోనే గ్యాస్ ట్యాంక్‌తో పాటు రెసిడెన్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయని, అదృష్టవశాత్తు భారీ ప్రమాదం జరగలేదని హూస్టన్ మేయర్ జాన్ విట్మైర్ తెలిపారు. రేడియో టవర్ కూలిన తర్వాత భారీ స్థాయిలో అక్కడ మంటలు వ్యాపించాయి. ఘటన పట్ల ఫెడరల్ ఏవియేషన్ శాఖ దర్యాప్తు చేపట్టింది.