Friday, November 22, 2024

పెరుగుతున్న అమర్‌నాథ్ యాత్రికుల సంఖ్య

అమర్ నాథ్ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. యాత్ర నిన్నటితో ఐదో రోజుకు చేరింది. ఒకే రోజు 19వేల మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర సాగుతున్న కొద్ది యాత్రికుల సంఖ్య పెరుగుతోందని అమర్‌నాథ్ క్షేత్ర ట్రస్ట్‌ బోర్డ్‌ తెలిపింది. దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూకు తరలివస్తున్నారని పేర్కొంది. ఈ క్రమంలో యాత్రికుల కోసం అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ప్యాసింజర్ ఫీడ్‌బ్యాక్ సర్వీస్ (PFS) ప్రారంభించింది.

శిబిరాల్లో వసతి, పరిశుభ్రత, ఆహారం నాణ్యతపై ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంతో పాటు ప్రయాణికుల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నది. అమర్‌నాథ్‌ యాత్ర కోసం తత్కాల్‌ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించగా.. పెద్ద ఎత్తున ప్రయాణికులు బారులు తీరుతున్నారు. రైల్వేస్టేషన్‌లోని వైష్ణవిధామ్‌, పురాణి మండిలోని రామమందిరం, మహాజన్‌ సభ వద్ద తత్కాల్‌ రిజిస్ట్రేషన్‌ జరుగుతుండగా.. పెద్ద సంఖ్యలో పర్యాటకులు బారులు తీరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement