Wednesday, November 20, 2024

హైదరాబాద్​ సిటీ జనానికి గొప్ప అవకాశం.. ప్రారంభమైన ఆక్వా ఎగ్జిబిషన్​

హైదరాబాద్‌లో మరో అద్భుతం కనివిందు చేయనుంది. వివిధ దేశాల్లో నీటి లోపల టన్నెల్‌ను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల చేపలను దగ్గర్నుంచి చూసేలా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇలాంటి అద్భుతం హైదరాబాద్‌ ఇప్పుడు భాగ్యనగరం నడిబొడ్డున కనిపించబోతుంది. నగరవాసులు వేసవిలో ఎంజాయ్ చేసేందుకు ఆక్వా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ అండర్‌ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్‌ని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేశారు. శనివారం దీన్ని ప్రారంభించగా.. రానున్న రెండు నెలల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

ఇక ఒక్కొక్కరికి రూ.100 చొప్పున అండర్ వాటర్ ఎగ్జిజిషన్ చూసేందుకు అనుమతిస్తున్నారు. దాదాపు టీవీల్లో కనిపించే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు పిల్లలతో పాటు పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ టన్నెల్‌ను ఏర్పాటు చేసేందుకు దాదాపు 6 నెలల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో దాదాపు 3 వేల రకాల చేపలు ఉన్నాయి. స్టార్‌, ఎంజెల్, క్లోన్ ఫిష్ వంటి వాటితో పాటు ఈల్స్‌, బాక్స్‌ ఫిష్ లాంటి చేపల్ని ఉంచారు.

మలేషియా, సింగపూర్‌, కేరళ వంటి ప్రాంతాల నుంచి వీటిని దిగుమతి చేసుకున్నారు. అక్కడ మాత్రమే లభించే ఈ రకం చేపల్ని చూసే అవకాశం ఇప్పుడు నగరవాసులకి కలగనుంది. ఈ ఎగ్జిబిషన్‌లో బాగా ప్రత్యేకమైనది ఆరపైమా చేప. ఇది సుమారు 60 కిలోలు ఉంటుంది. అంతేకాదు, రోజుకు అర కిలో చికెన్ తింటుందని నిర్వాహకులు తెలిపారు. దీని విలువ మార్కెట్‌లో సుమారు రూ.6 లక్షలు ఉంటుంది. టన్నెల్ ఎక్వేరియమ్‌కు వెళ్లి ఈ అరుదైన చేపను చూడవచ్చు. చేపలు బతికుండేలా వాటికి కావాల్సిన ఉష్ణోగ్రతల మధ్య ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -

విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన ఇలాంటి టన్నెల్‌కు మంచి ఆదరణ రావటంతో వివిధ నగరాల్లో ఏర్పాటు చేయాలని భావించారు నిర్వాహకులు. అందుకే వివిధ చోట్ల ప్రజలు ఆస్వాదించేలా చర్యలు చేపడుతున్నారు. మరిన్ని నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement