Tuesday, November 26, 2024

సూర్యుడిలో మహా విస్ఫోటనం.. 3.25 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించిన మహాజ్వాల

సూర్యుడంటేనే అగ్నిగోళం. అందులో లక్షల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలతో నిరంతరం మండుతూండే ద్రవరూప జ్వాల (ప్లాస్మా) నిప్పులుకక్కుతూ ఉంటుందని అందరీ తెలుసు. కానీ మునుపునెన్నడూ లేనివిధంగా ఇటీవల సూర్యగోళంలో మహా విస్ఫోటనం సంభవించింది. అప్పుడు ఎగసిన మహోజ్వల జ్వాల (ప్లాస్మా) విస్తరించిన పొడవు ఖగోళ శాస్త్రవేత్తలను అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా 3,25,000 కిలోమీటర్ల పొడవున ఆ జ్వాలా రేఖ ఎగసిపడింది. దాని పొడవు… దాదాపు భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరమంత ఉందని సరిపోల్చి చెప్పారు. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ఇలా జరగడం చూడ లేదని, సూర్యుడి తూర్పు భాగంలో జరిగిన ఈ విస్ఫోటనాన్ని వర్ణించడానికి పదాలు లేవని వారు పేర్కొన్నారు. కెంటకీలోని నిఖోలస్‌విల్లేలోని తన ఇంటి వెనకాల ఉన్న అబ్జర్వేటరీలో పరిశోధనలు చేస్తున్న ఖగోళ శాస్త్రవేత్త రిచర్జ్‌ ఎన్‌. స్క్రాంత్‌జ్‌ ఈ విస్ఫోటన దృశ్యాన్ని గుర్తించాడు.

ఆ జ్వాల ఎగసిపడుతున్న దృశ్యాన్ని స్పేస్‌వెదర్‌.కామ్‌ ఒడిసిపట్టి దానికి సంబంధించిన ఛాయాచిత్రాలను విడుదల చేసింది. భూమికి అభిముఖంగా ఉన్న సూర్యుడిపై కాకుండా వెనుకవైపు ఈ విస్ఫోటనం జరిగిందని, అందువల్ల భూమండలంపై ఎటువంటి దుష్ఫలితాలుండవని పేర్కొంది. ఈ పరిణామాన్ని మరికొందరు ఖగోళ శాస్త్రవేత్తలుకూడా గుర్తించారు. సూర్యుడిలో ఏఆర్‌ 3068 అనే క్షేత్రంలో నిరంతరం (బీటా గామా అయస్కాంత క్షేత్రం) శక్తిని సృష్టిస్తూం టాయి. దానివల్ల ఎం-క్లాస్‌ అనే సూర్యజ్వాలలు చెలరేగుతూంటాయి. ఆ అయస్కాంత క్షేత్రం ఇటీవలి కాలంలో మరింత చైతన్యవంతం అవడాన్ని గుర్తించామని, అందువల్లే తాజా విస్ఫోటనం జరిగి ఉండొచ్చని స్పేస్‌వెదర్‌ . కామ్‌ పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement