Friday, November 22, 2024

దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీల్లో చెల‌రేగిన‌ మంటలు.. ప్రయాణికులు సేఫ్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లి వెళుతున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక రైలు బోగీలో మంటలు చెలరేగాయి. లగేజీ బోగీ అని తేలడంతో అధికారులు ఊపీరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే అధికారి అభయ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.

ఢిల్లి వెళుతున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరింది. బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ దగ్గరికి రాగానే చివరి బోగీలో మంటలు అంటుకున్న విషయాన్ని గుర్తించారు. సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో పగిడిపల్లి స్టేషన్‌లో రైలును ఆపి నాలుగు ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రెండు పార్శిల్‌ బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. బోగీలో దగ్ధమైన వాటిల్లో ఎక్కువగా అమెజాన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ గృహ వినియోగానికి చెందినవిగా గుర్తించారు. ప్రమాదంపై పూర్తి విచారణ జరిగాకే కారుణాలు తెలుస్తాయని అభయ్‌ కుమార్‌ గుప్తా వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement