కరీంనగర్ : జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ భౌతికకాయానికి నేడు ఆయన స్వగ్రామంలో పూర్తి సైనిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై అనిల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ముందుగా అనిల్ భౌతిక కాయానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, ఎంపి బండి సంజయ్, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ పవన్ కుమార్ లు, ఆర్మీ అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించాను. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమరవీరులు అనిల్ త్యాగాన్ని ప్రజలు మరువలేరన్నారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో వారు పాల్గొన్నాను. అమరులు అనిల్ అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జై జవాన్ అంటూ నినదించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement