Thursday, November 21, 2024

UP : ట్ర‌క్కు ఢీకొన్న డ‌బుల్ డెక్క‌ర్ బస్సు.. అయిదుగురు స్పాల్ డెడ్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి సమయంలో యమునా ఎక్స్ ప్రెస్ వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఓ బ‌స్సు ఎదురుగా వ‌స్తున్న‌ ట్రక్కును స్పీడ్ గా ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే ఐదురుగు చనిపోగా, మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఢిల్లీ నుంచి అజాంఘడ్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు తప్పల్ దగ్గర ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీ కొట్టేసింది.

ఇక, ఈ ఘటనలో మ‌ర‌ణించిన వారిలో ఓ పసికందు, ఓ మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరో 15మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం మొత్తం తుక్కుతుక్కు అయిపోయింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతి కష్టం మీద బయటకు తీయగా… గాయపడిన వారిని జెవార్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement