Friday, November 22, 2024

ఇదేందిరా అయ్యా !! ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా ?

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి అందరిని ఆకట్టుకుంటుంది. మధ్యప్రదేశ్ లోని రాట్లంకు చెందిన వధూవరులు ఇద్దరూ కరోనా కారణంగా పీపీఈ కిట్లు ధరించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పెళ్ళి జరిపించే పండితుడితో పాటు ముగ్గురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. అందరూ పీపీఈ కిట్లు ధరించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 19న వరుడికి కోవిడ్-19గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.

అయితే ఈ వివాహాన్ని ఆపడానికి ఆ ప్రాంతం తహసీల్దార్ ప్రయత్నించారట. కానీ వారి కుటుంబ సభ్యుల ఈ పెళ్లిని ఆపకూడదని రిక్వెస్ట్ చేశారట. అంతేకాకుండా ఈ వేడుకలో వధూవరులిద్దరూ పీపీఈ కిట్లు ధరించడంతో కరోనా వ్యాప్తికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అధికారులు, పోలీసుల అనుమతితోనే ఈ వివాహం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ పెళ్ళిపై నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్ళి అవసరమా ? అంత తొందరేం వచ్చింది… కొన్ని రోజులు అగలేకపోయారు ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement