బాల్కొండ, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లాలో ఇవ్వాల ఘోర ప్రమాదం జరిగింది. బాల్కొండ దగ్గర జాతీయ రహదారి 44పై సోమవారం ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో లారీ డ్రైవర్ రాబిన్ ఖాన్ (25), కంటైనర్ డ్రైవర్ రాస్మోద్దీన్ ఖాన్ (20) అక్కడికక్కడే చనిపోయారు. కంటైనర్ క్లీనర్ ఖుర్షీద్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అతడిని నిర్మల్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ రూట్‌లో కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న హర్యానాకు చెందిన లారీ ఒకటి.. జాతీయ రహదారి 44 పై బాల్కొండ సమీపంలో టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో జాతీయ రహదారి నడిరోడ్డుపై లారీ నిలిపి ఎలాంటి ఇండికేషన్స్ లేకుండానే డ్రైవర్ టైరు మారుస్తున్నాడు. ఈ క్రమంలో లారీ వెనుక నుంచి వచ్చిన నాగాలాండ్ కు చెందిన కంటైనర్ ఆ లారీని ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ రాబిన్ ఖాన్ అక్కడికక్కడే చనిపోయాడు.
కంటైనర్ డ్రైవర్ రాస్మోద్దీన్ ఖాన్ కు తీవ్ర గాయలై లారీలోనే ప్రాణాలు కోల్పోయాడు. కంటైనర్ క్లీనర్ ఖుర్షీద్ కు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. నేషనల్ హైవే అంబులెన్స్ లో క్షతగాత్రుడిని నిర్మల్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అటువైపు వెళ్తున్నా మరో లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి, బాల్కొండ ఎస్సై గోపితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాక్సిడెంట్‌కు గురైన రెండు లారీలను జెసిబి సాయంతో పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో బాల్కొండ పాత జాతీయ రహదారి మీదుగా దారి మళ్లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ఉట సీఐ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.