Thursday, November 21, 2024

TG | ముమ్మరంగా కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే !

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే జనగాం, ములుగు జిల్లాలలో వంద శాతం పూర్తయింది. నల్గొండ జిల్లా 99.7 శాతం పూర్తిచేసుకొని వందశాతం లక్ష్యానికి చేరువలో ఉంది.

17 జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తి…

కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, కొమరం భీం ఆసీఫాబాద్‌, నారాయణ్‌ పేట్‌, జయశంకర్‌ భూపాల పల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. హన్మకొండ (75.7 శాతం), మెడ్చల్‌ మల్కాజ్‌ గిరి (71.2 శాతం) మినహా మిగతా జిల్లాలలో 80 శాతానికి పైగా సర్వే పూర్తయింది.

జి.హెచ్‌.ఎంసీ పరిధిలో కూడ సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం నాటికి జిహెచ్‌ ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయల్సిసి వుండాగా 15,17,410 నివాసాలు సర్వే పూర్తిచేసి 60.60 శాతం లక్ష్యాన్ని సాధించింది. సర్వే సకాలంలో పూర్తి చేసేవిధంగా జిల్లా ఇన్‌ చార్జ్‌ అధికారులు కలెక్టర్‌లు ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement