ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర్ కాశి, రుద్రప్రయాగ్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. ఉత్తర్‌కాశిలోని కుమారారా గ్రామంలో కాలువ నీరు పొంగి ఇళ్లలోకి ప్రవేశించింది. నీటితో వచ్చిన బురదలో ఇళ్లు కూరుకుపోయాయి. భారీ వర్షాలకు పలు ఇళ్లు, రహదారులు ధ్వంసం అయ్యాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోనూ భారీ వర్షాలకు ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. టు భారీ వర్షం కురియడంతో ఇండ్లు కూలిపోయాయి. భారీ వర్షాలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సమీక్ష నిర్వహించారు. బాధిత జిల్లాల్లో సహాయక చర్యలకు ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement