Tuesday, November 19, 2024

పాన్‌-ఆధార్‌ అనుసంధానికి చిరి ఛాన్స్‌

పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్‌ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ కోరింది. వచ్చే సంవత్సరం మార్చి 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తు చేసింది. లేకుంటే పాన్‌ కార్డు నిరుపయోగంగా మారుతుందని స్పష్టం చేసింది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు హోల్డర్లంతా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని కోరింది. దీనికి 2023 మార్చి 31 వరకు తుది గడువు ఉందని తెలిపింది.

గతంలో ఇందుకు ఇచ్చిన గడువు ముగిసింది. ఇప్పుడు ఫెనాల్టిdతో పొడిగించారు. తుది గడువులోగా పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసుకునే వారు వెయ్యి రూపాయల అలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడువులోగా తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ కోరింది. గడువు పూర్తయిన తరువాత పాన్‌ కార్డు ఉపయోగించుకునేందుకు అవకాశం లేదని తెలిపింది. దీని వల్ల బ్యాంక్‌ ఖాతాలు, డీ మ్యాట్‌ అకౌంట్‌ వంటివి తెరవడానికి వీలుకాదని తెలిపింది. ఇప్పటి వరకు ఇలా అనుసంధానం చేసుకోని వారు వెంటనే ఈ పని పూర్తి చేసుకోవాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement