Friday, November 22, 2024

దేశంలో ప్రతీ 7 సెకన్లకు బ్లడ్‌ క్యాన్సర్‌ కేసు.. ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదంటున్న వైద్య నిపుణులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో ప్రతీ 7 సెకన్లకు బ్లడ్‌ క్యాన్సర్‌ కేసు నమోదవుతుండగా, ప్రతీ 20 సెకన్లకు ఓ వ్యక్తి ఈ వ్యాధితో మృతి చెందుతున్నారు. స్త్రీ, పురుషుల మధ్య ఏ వయస్సులో ఉన్న వారినైనా ఒకే రకంగా ప్రభావితం చేసే లక్షణం ఉన్న ఈ వ్యాధికి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్చి వరల్డ్‌ క్యాన్సర్‌ మంత్‌ సందర్భంగా సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో బ్లడ్‌ క్యాన్సర్‌ విజేతలతో బ్లడ్‌ క్యాన్సర్‌ సర్వైవల్‌ సమ్మిట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్‌ హెమటో-ఆంకాలజిస్ట్‌ , బిఎంటి స్పెషలిస్ట్‌ డా.గణేష్‌ జైషత్వర్‌ మాట్లాడుతూ బ్లడ్‌ క్యాన్సర్‌ను హెమటోలజీ క్యాన్సర్‌ అని కూడా అంటారనీ, ఇది రక్తం, ఎముక మజ్జ లేదా శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్‌ అని పేర్కొన్నారు.

- Advertisement -

దేశంలోని ప్రతీ లక్ష జనాభాకు 5 కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. బ్లడ్‌ క్యాన్సర్‌ పరిశోధన, చికిత్సలో తాజా పురోగతిని ఆయన వివరిస్తూ ఇప్పుడు వచ్చే మెజారిటీ బ్లడ్‌ క్యాన్సర్‌లను ఆధునిక కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ వంటి అత్యంత అధునాతన చికిత్సా పద్దతులతో నయం చేయవచ్చని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ చికిత్సలు గత కొన్ని దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నవేననీ, అయితే, ఇప్పుడు మరింత ప్రభావవంతంగా తక్కువ విషపూరితంగా మారాయని చెప్పారు. యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డా. పవన్‌ గోరుకంటి మాట్లాడుతూ బ్లడ్‌ క్యాన్సర్‌ను జయించిన విజేతల మధ్య బ్లడ్‌ క్యాన్సర్‌ సర్వైవల్‌ సమ్మిట్‌ను నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement