Monday, November 25, 2024

సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు..

నార్సింగిలోని శ్రీ‌చైత‌న్య‌ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ క్లాస్‌రూంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న‌పై విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు దిగారు. ఒత్తిడి వల్లే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థులు సైతం ఆరోపించారు. సాత్విక్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌ లో న‌మోదు చేశారు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు.

నార్సింగిలో ఉద్రికత్త…
నార్సింగిలోని శ్రీచైత‌న్య కాలేజ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. నార్శింగి చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేప‌ట్టారు. తమకు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుండి కదలబోమన్నారు. FIRలో చేర్చిన నిందితులను తమ ముందుకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో సాత్విక్ తల్లిదండ్రులకు పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.

కేసు న‌మోదు చేశాం : శివ కుమార్, సీఐ, నార్సింగి
నిన్న నైట్ శ్రీచైతన్య ఇంటర్ కాలేజ్ క్యాంపస్ లో సాత్విక్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. పేరెంట్స్ ఇచ్చిన కాంప్లెయింట్ తో కాలేజ్ యాజమాన్యం ఫ్యాకల్టీ ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ లపై కేసు నమోదు చేశాం. సాత్విక్ డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించాం. సాత్విక్ పేరెంట్స్ ని కాలేజ్ మేనేజ్మెంట్ తో మాట్లాడిస్తాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement