దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో అస్సాంలోని గౌహతిలోని పోలీస్ స్టేషన్‌లో రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మోంజిత్ చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హద్దులు దాటి దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉన్నాయని ఫిర్యాదులో చాటియా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అశాంతిని, వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం నింపాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉందన్నారు. అయితే అబద్ధాలను ప్రచారం చేసి దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేశారని చాటియా ఆరోపించారు.