నెక్కొండ, (ప్రభన్యూస్) : అగ్రకులానికి చెందిన వ్యక్తి దురుసు తనంతో దళిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు శుక్రవారం నెక్కొండ పోలిస్టేషన్లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో అగ్రకులానికి చెందిన తక్కెళ్ళపల్లి జితేందర్ రావు అదే గ్రామానికి చెందిన దళిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
జితేందర్ రావు సదరు మహిళ ఇంటికి ఎరువుల బస్తా కోసం ఇంటికి వెళ్ళిన ఈ క్రమంలో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. నర్సంపేట ఏసిపి సంపత్ రావు గుండ్రపల్లి గ్రామంలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. విచారణలో ఏసీపీ వెంట నెక్కొండ సిఐ హతిరాం, సిబ్బంది పాల్గొన్నారు.