ఇచ్చోడ, (ప్రభన్యూస్) : ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది.. అప్పుడే పుట్టిన బాలుడిని ఓ తల్లి బావిలో పడేసిన ఘటన ఇవ్వాల (గురువారం) రాత్రి చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలంలోని సిరిచేల్మా గ్రామంలో అప్పుడే పుట్టిన బాలుడిని ఓ తల్లి బావిలో పడేసిన సంఘటన వెలుగు చూసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బాలుని పడేసారని బావిలోనీరు లేకపోవడంతో బాలుడు బురదలో కూరుకుపోయాడు. బావిలో నుంచి చిన్న పిల్లని ఏడుపులువిన పడడంతో స్థానికులు గమనించి వెంటనే బయటకు తీసి చికిత్స కోసం ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు…
Big Breaking | పుట్టిన బాలుడిని బావిలో పడేశారు.. ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం
Advertisement
తాజా వార్తలు
Advertisement