రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఎదురు దెబ్బ తగిలింది. టీమ్ లోని స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్ ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్నాడు. 29 ఏళ్ల రజత్‌కి మడమ గాయంతో NCAలో చికిత్స పొందుతున్నాడు. ఈ సీజన్‌లో ఏదో ఒక దశలో రజత్ తమ తరుఫున ఆడేందుకు అందుబాటులో ఉంటాడని ఆర్‌సీబీ ఆశించింది. కానీ, ఇప్పుడు రజత్ పాటిదార్ మొత్తం సీజన్‌కు దూరంగా ఉండటంతో ఆర్‌సీబీకి పెద్ద దెబ్బ తగిలింది. గత సీజన్‌లో రీ ప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా వచ్చిన పాటిదార్ 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేసి తన ప్రతాపాన్ని చూపాడు.
“దురదృష్టవశాత్తూ, అకిలెస్ హీల్ గాయం కారణంగా రజత్ పాటిదార్ #IPL2023 నుండి తొలగించబడ్డాడు. రజత్ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రక్రియలో అతనికి మద్దతునిస్తూనే ఉంటాము. కోచ్‌లు, మేనేజ్‌మెంట్ రజత్‌కు బదులుగా ప్లేయర్‌ని పేర్కొనకూడదని నిర్ణయించుకుంది”అని RCB ట్వీట్ చేసింది.
అదే సమయంలో MIతో జరిగిన ఆర్‌సీబీ ప్రారంభ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. కానీ, వారి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రీస్ టాప్లీ భుజానికి గాయం అయ్యింది. తదుపరి మ్యాచ్‌కు అతను ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాలి.