Friday, November 1, 2024

కరోనాతో 39 రోజుల పసికందు మృతి

దేశంలో కరోనా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ భయపెట్టిస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కబళిస్తోంది. కరోనా మహమ్మారి 39 రోజుల పసికందును బలి తీసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా సోకి ఇంత తక్కువ వయసులో చనిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. 39 రోజుల వయసున్న ప‌సి బాలుడు కోవిడ్ -19తో ఇక్కడి సాట్ ఆసుపత్రిలో మరణించాడు. శిశువు మరణం రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన అతి పిన్న వయస్కుడైన కోవిడ్ మరణం కావడం గమనార్హం. తిరువనంతపురంలో శనివారం నిర్ధారించిన 25 కోవిడ్ -19 మరణాల జాబితాలో మరణం చేర్చబడింది.

కాగా, గతేడాది కేరళలో కోవిడ్ -19 తో నలుగురు పిల్లలు మరణించారు. మలప్పురంలో 3.5 నెలల పనికందు( మగ), మలప్పురంలో 5 నెలల శిశవు( ఆడ), కాసరగోడ్‌లో 7 నెలలు (ఆడ), మలప్పురంలో 4 నెలల వయసున్న మగ శిశువు మృతి చెందారు.

ఇదీ చదవండి: ఏపీలో కఠినంగా కరోనా ఆంక్షలు.. కర్ఫ్యూ సమయం పెంచే అవకాశం?

Advertisement

తాజా వార్తలు

Advertisement