విజయవాడ: అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో పేరు గాంచిన నగరంలోని మణిపాల్ ఆసుపత్రి (Manipal Hospital) మరోమారు వార్తల్లోకి ఎక్కింది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైన జి.సరోజిని (68) అనే మహిళకు మణిపాల్ వైద్యుడు డాక్టర్ సురేంద్ర జాస్తి విజయవంతంగా బేరియాట్రిక్ సర్జరీ చేసి ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు.
ఈ ఆపరేషన్‌పై డాక్టర్ సురేంద్ర జాస్తి మాట్లాడుతూ.. ప్రజల జీవన శైలిలో మార్పులు అనారోగ్యాలకు కారణమవుతున్నాయన్నారు. ఎవరికి వారే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. సరోజని కేసు విషయంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని, దీంతో బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. జీర్ణవ్యవస్థలో మార్పు తీసుకు రావడంతోపాటు పొట్ట పరిమాణాన్ని తగ్గించామని, బరువును కూడా అదుపు చేయగలిగామన్నారు. బేరియాట్రిక్ సర్జరీలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. మణిపాల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ.. బేరియాట్రిక్ సర్జరీ చాలా కీలకమైనదన్నారు. తక్కువ మొత్తంలో సామాన్యులకు కూడా బేరియాట్రిక్ సర్జరీ సౌకర్యాన్ని అందించేందుకు తాము కృషి చేస్తున్నట్టు చెప్పారు. సరోజిని కేసు విషయంలో డాక్టర్ సురేంద్ర జాస్తి చేసిన కృషి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిందన్నారు. సర్జరీ విజయవంతం కావడంలో ఆయన కృషి అభినందనీయమని ప్రశంసించారు.