ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా 997 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 181 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 152, విశాఖ జిల్లాలో 139, కృష్ణా జిల్లాలో 110, నెల్లూరు జిల్లాలో 84, కర్నూలు జిల్లాలో 82, శ్రీకాకుళం జిల్లాలో 61, అనంతపురం జిల్లాలో 57, కడప జిల్లాలో 45, ప్రకాశం జిల్లాలో 41, తూ.గో. జిల్లాలో 28, ప.గో. జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో నలుగురికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 282 మంది కరోనా నుంచి కోలుకోగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,99,812 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,498 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 6,104గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,210గా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement