రష్యా దాడిని తిప్పికొట్టేందుకు పలువురు ఉక్రేనియన్ మాజీ సైనికులు, పౌరులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరుతుండగా, తాజాగా 98 ఏండ్ల ఉక్రెయిన్ మహిళ సైన్యంలో చేరేందుకు ముందుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో చురుకుగా పాల్గొన్న ఒలా టెడ్‌కిల్బోవ రష్యాతో పోరుకు సంసిద్ధతను తెలిపిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దమనకాండకు పుతిన్ ఆదేశాలు జారీ చేసిన అనంతరం ఓలా మాతృభూమిని కాపాడుకునేందుకు సైన్యంలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
వయోభారం కారణంగా ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చారు. త్వరలోనే ఆమె కీవ్‌లో విజయోత్సవ వేడుకలు చేసుకుంటారని ఆశిస్తున్నామని పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్‌కు 3800కు పైగా లైక్‌లు, పెద్దసంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..