Wednesday, October 30, 2024

Saudi | హజ్ యాత్రలో 98 భారతీయుల మృతి…

ఈ ఏడాది హజ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. దాదాపు 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 98 మంది భారతీయులు మరణించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మరణాలన్నీ సహజ కారణాల వల్ల నమోదయ్యాయని వెల్ల‌డించింది.

ఇక‌ ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ కోసం సౌదీ అరేబియాను సందర్శించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్కడి భారతీయుల కోసం తాము చేయగలిగినదంతా చేస్తున్నామని పేర్కొంది. ఇక ఈ ఏడాది మొత్తం 18.3 లక్షల మంది హజ్‌ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షల మంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షల మందికి పైగా ఉంటారని సౌదీ హజ్‌ అధికార యంత్రాంగం తెలిపింది.

- Advertisement -

అయితే, ఈ ఏడాది సౌదీ అరేబియాలో హాజ్ యాత్రకు హాజరైన వారిలో 10 దేశాలకు చెందిన 1,081 మంది యాత్రికులు మరణించినట్లు వైద్య అధికారులు ధృవీకరించారు. ప్రతి సంవత్సరం కనీసం 5లక్షలు మంది హజ్ యాత్ర‌లో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వాస్తవ సంఖ్య 30 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement