Friday, November 22, 2024

పానీ పూరీ తిని అస్వ‌స్థ‌త‌కి గురైన – 97మంది చిన్నారులు -ప‌రామ‌ర్శించిన కేంద్ర‌మంత్రి

ఒక జాత‌ర‌లో పానీ పూరీ తిని 97మంది పిల్ల‌లు అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. ఈ సంఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని సింగర్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. మధ్యప్రదేశ్‌లోని మండలా జిల్లాలో జరిగిన ఒక జాతరలో పానీ పూరీ తిని 97 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్‌తో బాధపడ్డారని ఆరోగ్య అధికారి ఒకరు వెల్లడించారు. చిన్నారులు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని జిల్లా ఆస్పత్రి సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ కేఆర్‌ శక్య తెలిపారు. ఫుడ్‌ పాయిజన్‌తో 97 మంది చిన్నారులు జిల్లా ఆసుపత్రిలో చేరారని చెప్పారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్నారు. ఇక, ఆస్పత్రిలో అస్వస్థతకు గురైన చిన్నారులకు అందుతున్న చికిత్సను ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మస్కోలే, జిల్లా కలెక్టర్ హర్షికా సింగ్ పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యుడు Faggan Singh Kulaste పరామర్శించారు. ‘‘గత రాత్రి మా ఏరియా పరిధిలోని సింగర్‌పూర్‌లో సుమారు 60 మంది చిన్నారులకు ఫుడ్‌ పాయిజన్‌ ​​అవడంతో.. మండలా జిల్లా ఆసుపత్రి సీఎంహెచ్‌ఓ, సిఎంఓతో ఫోన్‌లో మాట్లాడి చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు సూచనలు చేశాన‌ని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement