Friday, November 22, 2024

లూనా-25 వైఫల్యంతో ఆసుపత్రిపాలైన సైంటిస్ట్‌.. 90 సంవత్సరాల రష్యన్‌ శాస్త్రవేత్త ఆవేదన

రష్యాకు చెందిన లూనా-25 వ్యోమనౌక చంద్రుడిపై కుప్పకూలడంతో సదరు మిషన్‌కు కీలకమైన కన్సల్టెంట్‌గా పనిచేసిన 90 సంవత్సరాల రష్యన్‌ వ్యోమగామి, శాస్త్రవేత్త మిఖాయిల్‌ మరోవ్‌ ఆసుపత్రిపాలైనారు. లూనా-25ను చంద్రుడిపైకి చేర్చలేకపోవడం అత్యంత విషాదకరమని మరోవ్‌ అన్నారు.

చంద్రుడిపై రష్యా చేస్తున్న పరిశోధనలకు కొత్త ఊపు తేవడానికి ఒక చిట్టచివరి ఆశగా లూనా-25 మిషన్‌ను తాను భావించినట్టు ఆయన తెలిపారు. లూనా-25 కుప్పకూలిపోవడం వెనుక కారణలపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలనే ఆశాభావాన్ని మరోవ్‌ వ్యక్తం చేశారు. ”బాధపడకుండా(లూనా-25 వైఫల్యంపై) నేనెలా ఉంటాను? నాకు అది నా జీవితం కన్నా ఎక్కువైనది. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది” అని ఆయన వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement