Friday, November 22, 2024

2014-2022 వరకు రూ.90 లక్షల కోట్లు ఖర్చు : నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లి : పెట్రోల్‌, డీజెల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు అనేది.. రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ (ఆర్‌ఐసీ) ఆధారంగా నిర్ణయించబడిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోలేమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం చెప్పుకొచ్చారు. ఎక్సైజ్‌ సుంకం తగ్గింపునకు సంబంధించిన భారమంతా.. కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. నవంబర్‌, 2021లో కూడా ఎక్సైస్‌ సుంకాన్ని తగ్గించామని గుర్తు చేశారు. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజెల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినట్టు తెలిపారు. ఇది అంతా ఆర్‌ఐసీ ఆధారంగా చేసినట్టు నిర్మలమ్మ వివరించారు. బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (బీఈడీ), స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (ఎస్‌ఏఈడీ), రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ (ఆర్‌ఐసీ), అగ్రికల్చర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్స్‌ సెస్‌ (ఏఐడీసీ) కలిపి పెట్రోల్‌, డీజెల్‌పై ఎక్సైజ్‌ సుంకమని చెప్పుకొచ్చారు. బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీని రాష్ట్రాలతో పంచుకుంటామని, కానీ ఎస్‌ఏఈడీ, ఆర్‌ఐసీ, ఏఐడీసీ మాత్రం పంచుకోలేమన్నారు. ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆమె ఆదివారం స్పందించాల్సి వచ్చింది.

యూపీఏ హయాంలో రూ.49లక్షల కోట్లు..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డేటా ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014 నుంచి 2022 వరకు డెవలప్‌మెంట్‌ ఎక్సపెండేచర్‌ రూ.90.90 లక్షల కోట్లుగా ఉందని నిర్మలమ్మ తెలిపారు. యూపీఏ ప్రభుతం అధికారంలో ఉన్న 2004-2014 సమయంలో కేవలం రూ.49.2 లక్షల కోట్లు మాత్రమే డెవలప్‌మెంట్‌ కోసం ఖర్చు చేసినట్టు వివరించారు. నరేంద్ర ప్రభుత హయాంలో ఆహారంపై రూ.24.85 లక్షల కోట్లు, ఇంధనం, ఎరువులపై సబ్సిడీల కోసం రూ.26.30 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో ఈ రంగాలకు కేవలం రూ.13.90 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement