Thursday, November 21, 2024

చిన్నారి ప్రాణం తీసిన ఊయల

హైదరాబాద్ నగరంలోని నాచారంలో గురువారం విషాదం నెలకొంది. చీరతో కట్టిన ఊయలలో ఊగుదామని భావించిన చిన్నారికి ఆ ఊయలే యమపాశంగా మిగిలింది. చీరలో ఇరు‌క్కుని ఊపిరి ఆడక చిన్నారి మృతి చెందింది.

స్థాని‌కుల వివ‌రాల ప్రకారం.. నాచా‌రంలో నివ‌సించే వల్లూరి రమే‌ష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు (పాప, బాబు). పాప మన‌స్విని (9) నాలుగో తర‌గతి చదు‌వు‌తోంది. బాబు మాన‌సిక విక‌లాం‌గుడు. గురు‌వారం రమేష్ దంపతులు పని నిమిత్తం బయ‌టకు వెళ్లారు. మన‌స్విని ఇంట్లో ఫ్యాన్‌ కొక్కా‌నికి కుర్చి‌వే‌సు‌కుని చీరతో ఊయల కట్టింది. కొద్ది‌సేపు ఊగింది. అలా ఊగే క్రమంలో మెడకు చీర చు‌ట్టుకుని ఊపిరి ఆడక చని‌పో‌యింది. తల్లి‌దం‌డ్రులు ఇంటికి తిరిగి వచ్చేసరికి పాప ఊయలలో విగ‌త‌జీ‌విగా పడి ఉంది. కాగా ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement