Friday, November 22, 2024

దేశవ్యాప్తంగా 9 లక్షల మంది బ్యాంక్‌ సిబ్బంది నిరసన.. బ్యాంకుల ప్రైవేటీకరణపై వ్యతిరేక గళం..

ప్రభుతరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకింగ్‌ సిబ్బంది దేశవ్యాప్తంగా తలపెట్టిన రెండు రోజుల సమ్మె బ్రాంచుల వద్ద సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని బ్రాంచుల వద్ద సేవలకు ఆటంకం ఏర్పడింది. దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది బ్యాంక్‌ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, పాతతరం ప్రైవేటు సెక్టార్‌ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు, ఆఫీసర్లు సమ్మెలో పాల్గొన్నారు. కాగా శుక్రవారం ఆందోళనలతో ఈ సమ్మె ముగియనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బ్యాంక్‌ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. బ్రాంచుల ముందు నిరసన ప్రదర్శనలు చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్రాంచులను ఉద్యోగులు మూసిశారు. కస్టమర్‌ సరీసె సెంటర్లను కొనసాగించారు. ఔట్‌సోర్సింగ్‌గా తమ కార్యకలాపాలను అందించారు. యూఎఫ్‌బీయూ నేషనల్‌ కన్వీనర్‌ సంజీవ్‌ కే బండ్లిష్‌ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా సమ్మె సంపూర్ణ విజయవంతమయిందన్నారు. శుక్రవారం స్పందనను బట్టి తిరిగి స్పందిస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వివరించారు. ప్రైవేటీకరణకు అవకాశం కల్పిస్తున్న బిల్లును రద్దు చేసేందుకు ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఈ యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. యూఎఫ్‌బీయూలో ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫిడరేషన్‌, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌ సహా మొత్తం 9 యూనియన్లు ఉన్నాయి. 2021-22 బడ్జెట్‌లో బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదన చేసిన నాటి నుంచి బ్యాంక్‌ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement