Tuesday, November 26, 2024

యూపీఐ ద్వారా 9.36 బిలియన్‌ లావాదేవీలు .. 10.25 లక్షల కోట్ల చెల్లింపులు

ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు యూపీఐ ద్వారా 9.36 బిలియన్‌ లావాదేవీలు జరిగాయి. వీటి ద్వారా 10.25 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని సోమవారం నాడు విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించారు. యూనైటెడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా అధికంగా వ్యక్తుల నుంచి వ్యాపార సంస్థలకు చెల్లింపులు జరిగాయి. మొత్తం లావాదేవీల్లో ఇలా జరిగినవి 64 శాతం, చెల్లింపుల్లో 50 శాతం ఉన్నాయని వరల్డ్‌ లైన్‌ అనే పేమెంట్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. 2022లో మొదటి త్రైమాసికంలో 14.55 బిలియన్‌ లావాదేవీలు జరిగాయి. వీటి ద్వారా 26.19 లక్షల కోట్లు చెల్లింపులు చేశారు. 2021 మొదటి త్రైమాసికంలో జరిగిన లావాదేవీలు, చెల్లింపులతో పోల్చితే వరసగా 99, 90 శాతం పెరిగాయి. యూపీఐ చెల్లింపులు సంఖ్య పరంగా అత్యధికంగా ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం ద్వారా జరిగాయి. వీటితో పాటు అమెజాన్‌ పే, యాక్సిస్‌ బ్యాంక్‌ యాప్‌ ద్వారా కూడా ఎక్కువ లావదేవీలు జరిగాయి.

బ్యాంక్‌ల విషయంలో ఎక్కువగా ఎస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ల ఉన్నాయి. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎంల ద్వారా జరిగిన లావాదేవీలు 94.8 శాతం, చెల్లింపుల్లో 93 శాతం వీటి ద్వారానే జరిగాయి. క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు 7 శాతం ఉన్నాయి. చెల్లింపుల విషయంలో 26 శాతం ఉంది. డెబిట్‌ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు 10 శాతం, చెల్లింపులు 18 శాతం ఉన్నాయి. షాపులు, మాల్స్‌ వంటి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ ద్వారా 6.07 మిలియన్‌ లావాదేవీలు జరిగాయి. భారత్‌ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా జరిగిన 4.97 మిలియన్‌ లావాదేవీలు జరిగాయి. ఇది గత సంవత్సరంతో పోల్చితే 39 శాతం అధికం. యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా 172.73 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2022 సంవత్సరం మొదటి త్రైమాసిక నాటికి దేశంలో ఉన్న మొత్తం 991.28 మిలియన్ల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. మొబైల్‌ ద్వారా 15.6 బిలియన్‌ లావాదేవీలు జరిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement